RJDSEలు, DEOలు, DyEOలు, ACGEలు మరియు MEOలు గారికి తెలియజేయునది ఏమనగా,
UDISE+ పోర్టల్‌లో ఇప్పటికే పరీక్ష వివరాలు ఫైనలైజ్ చేయబడిన SSC నామినల్ రోల్‌లో ఉన్న అభ్యర్థుల కోసం “Edit Option” ప్రారంభించబడినది.
ఈ సదుపాయం ద్వారా ప్రతి పాఠశాల అభ్యర్థి వివరాలను మొత్తం గరిష్టంగా ఆరు (6) సార్లు మాత్రమే సవరించుటకు / అప్‌డేట్ చేయుటకు అవకాశం కల్పించబడినది.
ఉదాహరణకు:
ఒక అభ్యర్థి మొదటి Edit Optionలో ఇప్పటికే మూడు (3) సార్లు సవరణలు చేసినట్లయితే, తదుపరి Edit Optionsలో మిగిలిన మూడు (3) సార్లు మాత్రమే సవరణలు చేయుటకు అర్హుడు.
ఆరు (6) సవరణల అవకాశాలు పూర్తిగా వినియోగించిన తరువాత, ఏ పరిస్థితుల్లోనూ UDISE+ పోర్టల్‌లో మరిన్ని సవరణలు అనుమతించబడవు.
ఈ ఎంపికను పాఠశాలలు అత్యంత జాగ్రత్తగా వినియోగించవలసిందిగా సూచించబడుచున్నది.
Correction / Edit Optionపై క్లిక్ చేసిన తరువాత క్రింది వివరాలు మాత్రమే సవరించుటకు అందుబాటులో ఉంటాయి:
తండ్రి పేరు
తల్లి పేరు
కులం
ఉపకులం
ఫోటో
సంతకం
గుర్తింపు చిహ్నాలు
గమనికలు:
Subjects మరియు CWSN కేటగిరీలో ఎటువంటి సవరణలు చేయరాదు.
ఈ విషయములో సంబంధిత ప్రధానోపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.
Subjects మరియు CWSN కేటగిరీలలో చేసిన సవరణలు పరిగణనలోకి తీసుకోబడవు.
అభ్యర్థి పేరు మరియు జన్మతేదీ సవరణలు ఆధార్‌లో మాత్రమే చేయవలెను.
(ఈ వివరాల కోసం Edit Option తరువాత ప్రారంభించబడును.)
ఆధార్‌లో సవరణ పూర్తైన తరువాత, 15 రోజుల అనంతరం ఆ మార్పులు UDISE+లో ప్రతిబింబిస్తాయి.
ఈ విషయములో అన్ని RJDSEలు, DEOలు, Dy DEOలు మరియు ACGEలు గారికి సూచించునది ఏమనగా,
అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, వారు సమర్పించిన వివరాలలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకునేలా చర్యలు తీసుకోవలసిందిగా తెలియజేయవలెను.
ఇంకా తెలియజేయునది ఏమనగా, ఈ Edit Option ద్వారా UDISE+ పోర్టల్‌లో చేసిన అన్ని సవరణలు స్వయంచాలకంగా BSE పోర్టల్‌లో కూడా ప్రతిబింబిస్తాయి.
Edit Option తేదీలు:
07-02-2026 నుండి 12-02-2026 వరకు మాత్రమే
ధన్యవాదములతో,
డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్,
ఆంధ్రప్రదేశ్