• Home/
  • /
  • త్వరలో జరగబోయే పదోన్నతులు మరియు బదిలీలకు సంబంధించి సిఎస్సి పోర్టల్ పొందుపరచవలసిన సమాచారానికి సంబంధించి మండల విద్యాశాఖ అధికారులు 1&2లు మరియు డిడిఒ ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయు అతిముఖ్య మైన సూచనలు .........

త్వరలో జరగబోయే పదోన్నతులు మరియు బదిలీలకు సంబంధించి సిఎస్సి పోర్టల్ పొందుపరచవలసిన సమాచారానికి సంబంధించి మండల విద్యాశాఖ అధికారులు 1&2లు మరియు డిడిఒ ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయు అతిముఖ్య మైన సూచనలు .........

 త్వరలో జరగబోయే పదోన్నతులు మరియు బదిలీలకు సంబంధించి సిఎస్సి  పోర్టల్ పొందుపరచవలసిన సమాచారానికి సంబంధించి మండల విద్యాశాఖ అధికారులు 1&2లు మరియు డిడిఒ ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయు అతిముఖ్య మైన సూచనలు .........

 
మొట్టమొదటిగా మండల/జిల్లా పరిషత్, ప్రభుత్వ మరియు మున్సిపల్ యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులందరూ TIS లో నమోదైనారా లేదా చెక్ చేసుకోవలెను.
✅ రేపు అనగా శుక్రవారం 31వ తేది సాయంత్రం 4 గంటలలోపు ఖచ్చితంగా అందరు ఉపాధ్యాయులు తమ తమ లాగిన్లలో...
➡️ బేసిక్ డిటైల్స్
➡️ ఎడ్యుకేషన్  డిటైల్స్
➡️ అపాయింట్మెంట్ డిటైల్స్
➡️ ట్రాన్స్ఫర్ డిటైల్స్
➡️ ప్రొఫెషనల్ డిటైల్స్
ల్లో మీ వివరాలు సరైనవిగా నమోదైనవో లేదో చెక్ చేసుకోవలెను.
 
ఉపాధ్యాయులు అందరూ జనవరి  31వ తేదీ సాయంత్రం లోపు మీ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃపరిశీలించుకుని సమర్పించిన తదుపరి ఫైనల్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మరలా ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు సమాచారాన్ని మార్చడానికి అవకాశం వుండదు. మీరు సమర్పించిన సమాచారానికి మీరే బాధ్యులు.
 
ఒకసారి ఉపాధ్యాయుల తమతమ లాగిన్లలో సమర్పించిన సమాచారాన్ని డిడిఒలు తమ లాగిన్లలో వారి సర్వీసు పుస్తకాల ఆధారంగా పరిశీలించి కన్ఫర్మేషన్ చేయవలసివుంటుంది 
 
ఉపాధ్యాయులు TIS లో అతిముఖ్యంగా చూసుకోవలసిన అంశములు...
 
1. Date of Joing in Intial Service(ఉద్యోగంలో మొదటిసారిగా చేరిన తేది).
2. Academic & Professional qualifications
3. Date of Joining in the present cadre. 
4. Date of Birth
5. Post & Subject Medium
 
➡️ Very.. Very.. Very... Important ⬅️
 
✅ 610 జివో ప్రాప్తికి వున్న ఉపాధ్యాయుల వివరాలను 
✅ SC&ST ఉపాధ్యాయుల సమాచారం 
✅ ఫిజికల్లీ హాండీ క్యాప్డ్ ఉపాధ్యాయుల వివరాలను 
✅ గతంలో పదోన్నతులపై కోర్టుకు వెళ్ళిన ఉపాధ్యాయుల వివరాలను 
✅ డిస్ప్లేనరీ కేసులు నమోదైన ఉపాధ్యాయుల వివరాలను 
✅ సస్పెండ్ అయిన ఉపాధ్యాయుల వివరాలను చాలా జాగ్రత్తగా ఖచ్చితమైన సమాచారం తో వున్నాయో లేదో సదరు ఉపాధ్యాయుల సర్వీసు పుస్తకాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి తదుపరి మాత్రమే డిడిఒ లు కన్ఫర్మేషన్ చేయవలెను .
 
➡️ఏ పరిస్థితుల్లోనైనా డిస్ప్లేనరీ /సస్పెండ్ అయిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు కాకుండా  వారికి పదోన్నతులు ఇవ్వడం జరిగితే ఖచ్చితంగా సదరు డిడిఒలపై తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని గమనించగలరు. ⬅️
 
➡️TIS లో ఏ ఉపాధ్యాయుల పేర్లు లేకపోయినా డిడిఒ కన్ఫర్మేషన్ చేసాక మరలా తప్పులు వచ్చినా ఖచ్చితంగా డిడిఒ లే బాధ్యత వహించాల్సి ఉంటుందని గమనించగలరు.⬅️