• Home/
  • /
  • NMMS -2025 Update

NMMS -2025 Update

 *💥NMMS -2025 Update💥* 

 
ది.07-12-2025న నిర్వహించిన NMMS (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) పరీక్షకు హాజరైన కొందరు అభ్యర్థుల వర్గాల వారీ జాబితా విడుదల చేయబడింది.
 
 *THE LIST ENCLOSED IS NOT THE MERIT/SELECTED LIST* 
 
👉డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్, వారి ఉత్తర్వుల ప్రకారము-
సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు క్రింది సర్టిఫికేట్స్ *ది.16-03-2026* లోపు DEO కార్యాలయం, విజయవాడకు తప్పనిసరిగా సమర్పించవలెను.
 
 *➡️సమర్పించవలసిన సర్టిఫికేట్స్:* 
1. *SC/ST/BC కుల ధృవీకరణ పత్రం* 
SC వర్గానికి చెందిన వారు తాజా కేటగిరీ వారీ సర్టిఫికేట్ (గ్రూప్ 1/2/3)
2. *వికలాంగుల (PH) ధృవీకరణ పత్రం:* 
50% మరియు అంతకంటే పైగా ఉన్నవారు మాత్రమే.
3. *7వ తరగతి మార్కుల సర్టిఫికేట్:* 
OC/BC– 55% మరియు అంతకంటే పైగా
SC/ST/PHC  – 50% మరియు అంతకంటే పైగా
4. *ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్:* సంవత్సర ఆదాయం ₹3,50,000 అంతకంటే తక్కువ
 
5. *పాఠశాల వర్గం వివరాలు:* 
ప్రభుత్వ (Govt)
జెడ్పీ (ZP)
మున్సిపల్ (Mpl)
ఎయిడెడ్ (Aided)
మోడల్ స్కూల్స్ (హాస్టల్ సౌకర్యం లేకుండా)
MPUPS (VIII తరగతి నడుస్తున్న పాఠశాలలు)
 
     ప్రధానోపాధ్యాయులు ప్రతి Caste కేటగిరీలో ఉన్న విద్యార్థుల వివరాలను పూర్తిగా పరిశీలించి ధృవీకరించాలి. ఎవరైనా విద్యార్థి కుల ధృవీకరణ పత్రం సమర్పించని పక్షంలో, ఆ విద్యార్థి వర్గాన్ని జనరల్ (General) గా అప్డేట్ చేయవలెను.