🌷*_ముఖ్యమైన పెన్షనర్స్ జీ. ఓ.లు_*
1. పి.పి.ఓ.లను పెన్షనర్లు కోరుకున్న చోటికి మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ & అకౌంట్స్, ఆంధ్ర ప్రదేశ్ Cir.Memo No.D4/1455941/2021 (Comp No.1455941) Dt.27-102021 Treasuries, Accounts Dept. Govt.of A.P
2. 70 సంవత్సరములు పూర్తి చేసుకొనిన పెన్షనర్లకు/ఫ్యామిలీ పెన్షన్లకు ఆదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు (RPS 2022) G.O.Ms.No.30 Finance (HR-111 Pension, GPF) Department Dated 20-02-2022 Govt.of AP
3. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల డెత్ రిలీఫ్ (మట్టి ఖర్చులు) ₹15000/- నుండి ₹25000/- వరకు పెంచుతూ ఉత్తర్వులు (RPS 2022) G.O.Ms.No.60 General Administration (Service, Welfare) Department Dated 06-07-2022
4. పెన్షనర్ల స్పౌస్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు (RPS 2022) Cir.Memo No. FIN 01-HROMISC/20/2023-HR111, 2144840 Dt.26-09-2023
5. పెన్షనర్లు ₹10,000/-లు లోపు ఉన్నట్లయితే వారికి బియ్యం కార్డులు జారీ చేయుటకు అర్హులు ప్రభుత్వ ఉత్తర్వులు. Memo No.FCS01-FCCSOCSS (Misc/29/2021-CS-1) Dated 22-02-2023, Consumer affairs, Food & Civil Supplies (CS-1) Department, Govt.of AP.
6. G.O.No.315Fin (Pension-1) Dept.Dt.07-10-2010 ప్రకారం వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైనను పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ భార్యకు కుటుంబ పెన్షన్ కొనసాగిస్తారు.
7. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్/అకౌంట్స్ వారి ఫైల్ నెంబర్ F1no.2-14060/77/2023-D SEC-DTA, స్ట్.30-102024 పై ఉత్తర్వులు వితంతు / విడాకులు పొందిన కుమార్తెలు సర్వీస్ పెన్షనరు బ్రతికుండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితేనే కుటుంబ పెన్షన్ కు అర్హులని సూచించిరి.
8. రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్ హ్యాన్స్ డ్ ఫ్యామిలీ పెన్షన్, పెన్షనర్ రిటైర్డ్ అయినప్పటి నుండి 7 సంవత్సరములు లేదా బతికి ఉంటే 67 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఏది ముందైతే అది ఎన్ హ్యాన్స్ డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడును. తరువాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు సర్వీసులో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ 10 సంవత్సరాలు లేదా జీవించి ఉంటే 67 సంవత్సరాలు వచ్చేవరకు చెల్లిస్తారు. ఎన్ హ్యాన్స్ డ్ ఫ్యామిలీ పెన్షన్ :: చివరి వేతనము X 50/100 సాధారణ ఫ్యామిలీ పెన్షన్ :: చివరి వేతనం X 30/100 జీ.ఓ.ఎం.ఎస్. నంబర్ 2 తేదీ 17-01-2022
9. 01-04-2024 నుండి 31-03-2025 వరకు మెడికల్ రీయంబర్స్ మెంట్ పొడిగించబడినది. G.O.R.T. No. 449 Health Medical & Family Welfare (1.1) Dept. Govt.of A.P.
10. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు కనీసం పెన్షన్ మొత్తము ₹10,000/- లకు తగ్గకుండా చెల్లించాలి. G.O.Ms.No.1 Fin (PC-TA)Dept. Dt.17-01-2022