• Home/
  • /
  • మండల విద్యాశాఖాధికారులందరికీ సమాచారం

మండల విద్యాశాఖాధికారులందరికీ సమాచారం

 *📢 మండల విద్యాశాఖాధికారులందరికీ సమాచారం*

 
SLAS సర్వే నిర్వహణ నిమిత్తం, మీ మండల పరిధిలో సెలెక్ట్ చేయబడిన పాఠశాలలకు ఎన్యూమరేటర్స్‌ను నియమించాలి.
 
🔹 ప్రతి పాఠశాలకు అవసరమైన ఎన్యూమరేటర్స్ ని ఈ క్రింది ప్రాధాన్యతలతో / సూచనలు ప్రకారం మాత్రమే ఎంపిక చెయ్యాలి 
 
🔹 ఎంపికలో ప్రాధాన్యత క్రమం:
1️⃣ ముందుగా – CRMTలు
2️⃣ తర్వాత – క్లస్టర్ టీచర్లు
3️⃣ పై వారు అందుబాటులో లేకపోతే – పక్క క్లస్టర్ నుండి యాక్టివ్ టీచర్లు
 
⚠️ ముఖ్యమైన సూచన:
• CRMTలు/టీచర్లను వారి సొంత క్లస్టర్‌లో నియమించరాదు
• తప్పనిసరిగా పక్క క్లస్టర్ నుండి మాత్రమే నియమించాలి
 
📘 టెస్ట్ నిర్వహణ వివరాలు:
• టెస్ట్ 4వ, 6వ, 8వ తరగతులకు నిర్వహించబడుతుంది
• 6వ & 8వ తరగతుల్లో గరిష్టంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే టెస్ట్
• 40 మంది లేదా అంతకంటే తక్కువ ఉంటే – అందరికీ టెస్ట్
• 40 మందికి పైగా ఉంటే – కేవలం 40 మందికే టెస్ట్
 
👨‍🏫 ఎన్యూమరేటర్స్ అలాట్ విధానం:
• 4వ తరగతి – ప్రతి 20 మంది విద్యార్థులకు 1 ఎన్యూమరేటర్
• 6వ & 8వ తరగతులు – ప్రతి 40 మంది విద్యార్థులకు 1 ఎన్యూమరేటర్
 
🔹 ఎంపిక చేసిన ఎన్యూమరేటర్స్‌తో సంబంధిత పాఠశాలలో SLAS సర్వే నిర్వహణ చేయాలి.
 
⏳ ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి.