💐
*School grants 2026-27 Released*
👉సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలకు 1 నుంచి 30మంది విద్యార్థులకు రూ.10 వేలు, 30 నుంచి 100 మంది వరకు రూ.25వేలు, 100 నుంచి 250 మంది వరకు రూ.50 వేలు, 250 నుంచి వెయ్యి వరకు.75వేలు, వెయ్యిమందిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష మంజూరు చేసింది
👉పాఠశాలలకు విడుదలైన నిధులను ఎలా వినియో గించాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
👉 పాఠశాలలకు కేటాయించిన నిధుల్లో పది శాతం మొత్తాన్ని స్వచ్ఛతా కార్యక్రమాలకు వినియోగించాలి
టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థులకు తాగునీరు, రన్నింగ్ వాటర్, పారిశుధ్య కార్యక్రమాలకు వీటిని వాడాలి.
👉విద్యార్థులకు ప్లే మెటీరియల్ గేమ్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ప్రయోగశాలల నిర్వహణ, విద్యుత్ చార్జీలు, ఇంటర్నెట్, బోధన సామగ్రి, నీటివసతి కోసం స్కూలు గ్రాంటు నిధులను ఖర్చుచేయాలి.
👉 పాఠశాల భవన మరమ్మతులకు వినియోగించాలి. పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారానే ఈ నిధులను ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
👉 నిధుల వినియోగానికి సంబంధించిన అంచనాలను యాప్లో అప్లోడ్ చేసి మండల విద్యాధికారి ఆమోదంతోనే గ్రాంటును వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది.