• Home/
  • /
  • AP TET-2026 RESULT RELEASED AP TET 2026 రిజల్ట్స్ ఆన్లైన్ లో చెక్ చేసే పూర్తి విధానం,AP TET 2026 Results Link👇

AP TET-2026 RESULT RELEASED AP TET 2026 రిజల్ట్స్ ఆన్లైన్ లో చెక్ చేసే పూర్తి విధానం,AP TET 2026 Results Link👇

 TET ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య
ఏపీ టెట్ జూన్ 2026 పరీక్షా ఫలితాలు విడుదలఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) – జూన్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెట్-జూన్ 2026 పరీక్షలు ఆగస్టు 5వ తేదీ నుండి 16వ తేదీ వరకు 12 రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు 2,14,486 మంది అభ్యర్థులు 2,38,252 పేపర్లకు దరఖాస్తు చేసుకోగా, 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ అనంతరం ప్రాథమిక కీని ముందుగా విడుదల చేసి, అభ్యర్థుల నుండి స్వీకరించిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ ద్వారా పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన అనంతరం తుది కీ ఆధారంగా ఏపీ టెట్-జూన్ 2026 తుది ఫలితాలను విడుదల చేయడం జరిగింది.మొత్తం 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 90,862 మంది అభ్యర్థులు 99,591 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు, హాజరైన అభ్యర్థులు 45.63 శాతం పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. అందులో, 74,711 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 84,798 పేపర్లకు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 72,288 మంది ఉపాధ్యాయులు 81,127 పేపర్లకు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 37,789 మంది ఉపాధ్యాయులు 41,315 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు, హాజరైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 50.93 శాతం పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు.(అదేవిధంగా, ఏపీ టెట్-అక్టోబర్ 2025 పరీక్షలో 31,886 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు పాల్గొనగా, వారిలో 15,239 మంది, అనగా 47.82 శాతం మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణత పొంది ఉన్నారు).అభ్యర్థులు తమ క్యాండిడేట్ లాగిన్ తో ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్లో (tet2dsc.apcfss.in లేదా cse.ap.gov.in) లాగిన్ అయి ఏపీ టెట్-జూన్ 2026 పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఏపీ టెట్-జూన్ 2026 పరీక్షా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించినట్లు ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం. వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇట్లు
ఎం వెంకట కృష్ణారెడ్డి
కన్వీనర్ ఏపీ టెట్ జూన్ 2026
ఆంధ్రప్రదేశ్

AP TET 2026 Results Link👇

CLICK-HERE-FOR-TET-RESULT

AP TET 2026 రిజల్ట్స్ ఆన్లైన్ లో చెక్ చేసే పూర్తి విధానం 

CLICK-HERE-TO-WATCH-VIDEO