• Home/
  • /
  • Viప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ :: మంగళగిరి Rc.No.GE-CPR00RSLT(DPRP)/1/2026-DGE తేదీ: 17.02.2026 ప్రెస్ నోట్ మార్చి 2026 లో నిర్వహించబడనున్న SSC పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను హాజరుపరుస్తున్న అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

Viప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ :: మంగళగిరి Rc.No.GE-CPR00RSLT(DPRP)/1/2026-DGE తేదీ: 17.02.2026 ప్రెస్ నోట్ మార్చి 2026 లో నిర్వహించబడనున్న SSC పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను హాజరుపరుస్తున్న అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

 Viప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్

ఆంధ్రప్రదేశ్ :: మంగళగిరి
Rc.No.GE-CPR00RSLT(DPRP)/1/2026-DGE
తేదీ: 17.02.2026
ప్రెస్ నోట్
మార్చి 2026 లో నిర్వహించబడనున్న SSC పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను హాజరుపరుస్తున్న అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియ జేయునది ఏమనగా...
* ఈసారి మొదటి సారిగా విద్యార్థుల నామినల్ రోల్ వివరాలు UDISE పోర్టల్ నుండి సేకరించ బడినవి. 
* SSC పబ్లిక్ పరీక్షలు 16.03.2026 నుండి 01.04.2026 వరకు నిర్వహించ బడును.
* అభ్యర్థుల హాల్ టికెట్లు మార్చి 2026 మొదటి వారంలో BSE, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయబడును. అదనంగా సంబంధిత పాఠశాల లాగిన్లు, LEAP యాప్ మరియు వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అందుబాటులో ఉంచబడును.
* ఈ నేపథ్యంలో, ప్రధానోపాధ్యాయులు హాల్ టికెట్లలో పొందుపరిచిన విద్యార్థుల వివరాలు (ఇంటి పేరు, అభ్యర్థి పేరు, జనన తేది మరియు ఇతర వివరాలు) పాఠశాల రికార్డులతో సరిపోల్చి జాగ్రత్తగా పరిశీలించ వలసినదిగా సూచించ బడుచున్నది.
* ఇంటి పేరు, అభ్యర్థి పేరు మరియు జనన తేదీలో పొరపాట్ల సవరణ కోసం UDISE పోర్టల్‌లో 31.03.2026కు ముందు ఒక నిర్దిష్ట సమయంలో సవరణ అవకాశం కల్పించబడును.
* కాబట్టి, ముద్రిత హాల్ టికెట్లలో ఏవైనా తేడాలు గమనించిన పక్షంలో అభ్యర్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం మార్కుల మెమో (పాస్ సర్టిఫికేట్) జారీ దశ వరకు కూడా అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం ఇవ్వ బడును.
* పై విషయమై అన్ని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సిబ్బందికి విస్తృతంగా ప్రచారం చేయ వలసిందిగా మరియు అభ్యర్థుల వివరాల సవరణలపై ఎటువంటి ఆందోళన లేకుండా చూడ వలసిందిగా ఆదేశించ బడుచున్నది.
*SD/- డా. కె. వి. శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్*