• Home/
  • /
  • కాంట్రాక్ట్ ఉద్యోగుల HRM (CFMS) వర్క్‌ఫ్లో – సంక్షిప్త వివరణ

కాంట్రాక్ట్ ఉద్యోగుల HRM (CFMS) వర్క్‌ఫ్లో – సంక్షిప్త వివరణ

 కాంట్రాక్ట్ ఉద్యోగుల HRM (CFMS) వర్క్‌ఫ్లో – సంక్షిప్త వివరణ

 
నిధి/CFMS‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరోల్ ప్రక్రియ నాలుగు స్థాయిల్లో జరుగుతుంది.
 
స్థాయి–1: Head of Office / Head of Department (Secretariat Level) అధికారి CFMS‌లో Contract Employees Module (Process Code: 1049) ద్వారా Maker–Checker–Submitter రోల్స్‌ను సెట్ చేసి, కాంట్రాక్ట్ పోస్టులను సృష్టించి సంబంధిత DDO/యూనిట్ కార్యాలయాలకు పంపిస్తారు. ఆ పోస్టులు మ్యాప్డ్ ట్రెజరీ/PAOకు చేరుతాయి.
 
స్థాయి–2: ట్రెజరీ/PAO Auditor–Verifier–Approver విధానంలో ఆ పోస్టులను పరిశీలించి సిస్టమ్‌లో ధృవీకరిస్తారు.
 
స్థాయి–3: ట్రెజరీ ధృవీకరణ తర్వాత DDO ఆ పోస్టులపై ఉద్యోగులను నమోదు చేసి, వారి ప్రొఫైల్ & పే వివరాలు అప్డేట్ చేసి, హాజరు నమోదు చేసి నెలవారీ పే బిల్లును రూపొందిస్తారు (Maker–Checker–Approver విధానం ప్రకారం).
 
స్థాయి–4: కొత్తగా చేర్చిన ఉద్యోగుల వివరాలు మళ్లీ ట్రెజరీ/PAOకి వెళ్లి తుది ధృవీకరణ పొందిన తర్వాతే ప్రక్రియ పూర్తవుతుంది.
 
మొత్తానికి, ఈ విధానం ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరోల్ సక్రమంగా, నియంత్రణతో అమలు చేయబడుతుంది.ప్రస్తుతం ఈ ప్రక్రియ అమలులో (under process) ఉంది.HOD స్థాయిలో పోస్టులు సృష్టించి DDO స్థాయికి ఫార్వర్డ్ చేయవలసి ఉంది.
 
అందువల్ల, తదుపరి చర్యల కోసం సంబంధిత HOD స్థాయిని సంప్రదించగలరు. అలాగే, నిధి పోర్టల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల వర్క్‌ఫ్లోకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నదేమో DDO స్థాయిలో కూడా పరిశీలించగలరు.