• Home/
  • /
  • నూతన జిల్లాలు - ఉద్యోగుల విభజన :

నూతన జిల్లాలు - ఉద్యోగుల విభజన :

*❇️నూతన జిల్లాలు - ఉద్యోగుల విభజన :*
 
👉13 ఉమ్మడి జిల్లాలు.. 26 జిల్లాలుగా రూపుదిద్దుకున్న తరుణంలో గౌరవ CSE వారి కార్యాలయం నందు ఉపాధ్యాయ పోస్ట్స్ పునర్విభజన ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది.
 
👉 ది.01/03/2026 నాటి రోల్ ప్రకారం ఏ జిల్లాలో, ఏ పాఠశాలలో ఎన్ని పోస్ట్స్ అవసరమో ఈ నెల చివరి తేది నాటికి లెక్క తేలుతుంది.
 
👉 పాయింట్ నెంబర్ 5 ఆధారంగా ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు అయిన వివిధ కేడర్ల/ సబ్జెక్ట్స్ పోస్ట్స్ ను 26 జిల్లాలకు వాటి వాటి జన సంఖ్య ఆధారంగా పంపిణీ (కేటాయింపు) చేస్తున్నారు.
 
👉 ఈ ప్రక్రియ మొత్తం ఎట్టి లోపాలు లేకుండ సరి చూచి ది. 31/05/2026 లోగా ఒక కొలిక్కి తెస్తారు.
 
👉 జూన్ నెలలో అందరు లీప్ యాప్ ద్వారా తమ తమ ఆప్షన్స్ (ఏ జిల్లాకు ఏ ప్రయారిటీ) ఇవ్వవలసి ఉంటుంది.
 
👉 మన కేడర్ లో, మన సబ్జెక్ట్ లో మన సీనియారిటీ నంబర్, మనం మొదటి ఆప్షన్ లో కోరుకున్న జిల్లాలో... మన కేడర్/సబ్జెక్ట్ లో కేటాయించబడిన పోస్ట్స్ సంఖ్య లోబడి ఉంటే, మనకు అదే జిల్లా వస్తుంది. లేకుంటే మరో నూతన జిల్లాకు కేటాయించబడి, అక్కడ ఆ జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ ద్వారా పోస్టు తీసుకోవాలి.
 
👉 ఈ ప్రహసనం అంతా ది.31/07/2026 నాటికి ముగించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
 
👉 ఆ తరువాత కొత్తగా రూపుదిద్దుకున్న జిల్లాలలో జిల్లా పరిషత్ లు ఏర్పాటు అవుతాయి.
 
👉 కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కేంద్ర/ రాష్ర్ట ప్రభుత్వం నిధులు/గ్రాంట్స్ విడుదల అవుతాయి.
 
👉 తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం సమ పాళ్ళలో పరుగులు పెడుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది.
 
👉 ఉద్యోగ మరియు ఉపాధ్యాయ పోస్ట్స్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానిదే, జిల్లా పరిషత్ లు ఏర్పాటు కావు.
 
👉 జిల్లా పరిషత్ లు ఏర్పాటు కానిదే, నిధులు గ్రాంట్స్ విడుదల కావు.
 
👉 నిధులు, గ్రాంట్స్ విడుదల కానిదే అభివృద్ది జరగదు.
 

👉 కనుక రాష్ర్ట ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, యుద్ధ ప్రాతిపదికన పోస్ట్స్ పునర్విభజన ప్రక్రియ చేపట్టినది.