🅰️🅿️
*Funeral / Obsequies Charges..*
* స్కూల్లోని ఉద్యోగులు ఎవరైనా ఆకస్మిక మరణం చెందినపుడు వారి అంత్య క్రియల ఖర్చుల కింద ₹30,000 ప్రభుత్వం అందజేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.
* కాని ఆ డబ్బులు ఎలా రికవరీ చేయాలి, బిల్ ఎలా చేయాలి, ఎవరి అకౌంటుకు క్రెడిట్ చేయాలి తదితర వివరాలు మనలో చాలా మందికి తెలియదు.
* ఉద్యోగి మృతి చెందిన వెంటనే వారి వారసులకు ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగతంగా ఆ డబ్బులు అందజేసి తదుపరి డ్రా చేసుకోవచ్చు. లేదా బిల్లు చేసి డబ్బులు జమ ఐన తర్వాత డ్రా చేసి ఇవ్వవచ్చు.
*PROCEDURE:*
1. బిల్లుకు జత చేయాల్సినవి:
(a) Sanction proceedings
(b) డబ్బులు ముట్టినట్టు వారసుల advanced undertaking.
(c) ఉద్యోగి సర్వీస్ పుస్తకంలోని ఫ్యామిలీ మెంబర్స్ వివరాల పేజీ Xerox కాపీ.
2. బిల్లు చేయ వలసింది other bills -> form 102-> Regular Salary Heads ( 010 & 011 స్థానంలో 310 & 318 Replace చేయాలి)
3. ప్రధానోపాధ్యాయుల వ్యక్తిగత అకౌంటు ఇవ్వాలి.(వారసులది ఇవ్వాలంటే Legal Heir Certificate కావలసి ఉంటుంది.)
4. బిల్లు Submit చేయగానే STO వెంటనే Pass చేస్తారు. డబ్బులు కూడా వెంటనే Credit అవుతాయి.
* కాబట్టి అలాంటి విపత్కర పరిస్థితిలో ప్రధానోపాధ్యాయులుగా మనం వెంటనే డబ్బులు చెల్లించి తదుపరి ఈ తతంగం అంతా చేసుకుంటే సమయానికి ఆదుకున్నట్లు అవుతుంది.